CC camera | కాసింపూర్ గ్రామానికి సీసీ కెమెరాల ఏర్పాటు…

CC camera | కాసింపూర్ గ్రామానికి సీసీ కెమెరాల ఏర్పాటు…
CC camera | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కాసింపూర్ తాండ గ్రామంలో గ్రామ సర్పంచ్ లౌడ్య రామచందర్ నాయక్, గ్రామానికి ఆయన తన సొంత ఖర్చులతో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నట్లయితే దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎంతో తోడ్పడుతాయని అన్నారు.
చిన్న వయస్సులో పెద్ద బాధ్యత అప్పగించిన గ్రామ ప్రజలకు గ్రామాన్ని గ్రామాభివృద్ధి చేస్తూ గ్రామస్తులకు రుణపడి ఉంటామని తెలిపారు. గ్రామంలోని ప్రజలు కూడా గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యురాలు ధరావత్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్,గ్రామస్తులు గణేష్, బాల్య తదితరులు పాల్గొన్నారు.
