CBI raids | కుట్ర‌పూరితంగా కేసులు పెడితే స‌హించం…

CBI raids | కుట్ర‌పూరితంగా కేసులు పెడితే స‌హించం…

  • కాంగ్రెస్ ఎన్ని కుట్ర‌లు చేసినా ప్ర‌జా పోరాటం ఆపం

CBI raids | ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఆంధ్రప్రభ : సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే విచార‌ణ లేదు. ఎస్ఎల్‌బీసీ(SLBC) కూలిపోయి కార్మికులు స‌మాధి అయితే వెలికితీత లేద‌నీ, విచార‌ణ అంత‌క‌న్నా లేద‌నీ, ముఖ్య‌మంత్రిపై మంత్రి బిడ్డ విమ‌ర్శ‌లు చేస్తే స‌మాధానం లేద‌నీ, మంత్రివ‌ర్గంలోని ఒక మంత్రి ఇంటిలో సీబీఐ రైడ్స్(CBI raids) జ‌రిగితే దానిపై విచార‌ణ ఉండ‌ద‌నీ కానీ మాజీ మంత్రి కేటీఆర్(minister KTR) పై కేసులు ఎలా పెడతారని ప్రభుత్వ మాజీ చీప్ విప్ బీఆర్ఎస్(BRS) ఉమ్మ‌డి వరంగల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్క‌ర్‌ విమర్శించారు.

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప్ర‌పంచ ప‌టంలో అగ్ర భాగాన నిలిపిన కేటీఆర్‌పై నిర్వ‌హించిన ఈ రేసు పై విచార‌ణ పేరుతో వేధించ‌డం కాక మారేది కాదన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Govt) కేటీఆర్‌పై కుట్రపూరితంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply