CASH | మోసాలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

CASH | మోసాలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

  • 70 వేల్ నగదు, మొబైల్ స్వాధీనం
  • ఎ సి పి నితిన్ పండరి చేతన్

CASH | జనగామ, ఆంధ్రప్రభ : బ్యాంకుల వద్ద మోసాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని అరెస్ట్ చేసి 70 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు జనగామ ఏసీపీ నితిన్ పండరీ చేతన్ తెలిపారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కొడంగల్ కు చెందిన అడవి మీద నర్సింలు ( 40 ) అనే వ్యక్తి గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితుడు పై గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కేసులు నమోదైనట్టు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నవంబర్లో రెండు కేసులు జనవరిలో ఒక కేసు నమోదు అయిందని తెలిపారు. ప్రధానంగా బ్యాంకులకు వచ్చే అమాయకులను ఆసరా చేసుకుని వారితో బంధువులమని, పరిచయస్తులమని పరిచయం పెంచుకొని టిఫిన్, టీ తాగుతామని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం, వారి నుండి డబ్బులు తీసుకొని పారిపోవడం జరిగిందని తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో చోరీ చేయడానికి రాగా అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో గతంలో చేసిన నేరాలు అన్ని ఒప్పుకున్నాడని అతని వద్ద సోదాలు చేయగా 70 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ లభ్యమైందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసిపి నితిన్ పండరీ చేతన్ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న జనగామ సిఐ పి. సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ ఎం. భరత్, కానిస్టేబుల్ కర్ణాకర్, కృష్ణ, సాగర్, అనిల్ కుమార్, రమేష్, ప్రణయ్, చరణ్, శివప్రసాద్, ఐటి కోర్ టీం ఏవో సాల్మన్ లను వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజ మహేంద్ర నాయక్ అభినందించారు.

Leave a Reply