Carry Bags | ప్లాస్టిక్‌తో ప్ర‌మాదం..

Carry Bags | ప్లాస్టిక్‌తో ప్ర‌మాదం..

  • పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ బ్యాగులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Carry Bags | గుడివాడ, ఆంధ్రప్రభ : డిసెంబర్ ఒకటో తేదీ నుంచి గుడివాడ పరిపాలన సంఘ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్ర‌జ‌లు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్ధాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు పెను నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం అని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ పరిపాల సంఘం ప్రతిష్టాత్మకంగా మెప్మా వారి సహకారంతో తిరిగి వినియోగించేలా క్లాత్ సంచులను తయారుచేసి అందుబాటులో తేవడం అభినందనీయం అన్నారు. ప్రజలు చేతులు రుమాలు మాదిరిగానే చేతి సంచిని కూడా వినియోగించాలని సూచించారు. గుడివాడలో ప్లాస్టిక్ అనేది కనబడకుండా చేయాలన్న పురపాలక సంఘ సంకల్పంలో, ప్రజల కూడా భాగస్వామ్యులై తమ వంతు సహకారం అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, కమిషనర్ ఎస్.మనోహర్, త‌హ‌సీల్దార్ కుమార్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ గుడివాడ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, నాయకులు కంచర్ల సుధాకర్, వేసపోగు ఇమ్మానుయేలు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply