KHM | కాలిబాట కోసం భ‌క్తుల‌కు “కార్పెట్లు” ఏర్పాటు చేయాలి

భద్రాచలం(టౌన్), మే 11, (ఆంధ్రప్రభ) : పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో… దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మే నెల కావడం, ఎండలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేవస్థానం వారు కేవలం… పడమర మెట్ల నుండి అన్నదాన సత్రం వరకే కార్పెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

దీంతో ప్రసాదాల కౌంటర్ నుండి అన్నదాన‌ సత్రం, పడమర మెట్లు వైపుగా నడుచుకుంటూ వెళ్లాలంటే “కాలిబాట నిప్పురవ్వలు” కక్కుతుండడంతో లబోదిబోమంటూ అవస్తులు పడుతున్నారు భక్తులు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితులు చెప్పనవసరం లేదు. తక్షణమే రామాలయం అధికారులు స్పందించి భక్తులకు కార్పెట్లు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

Leave a Reply