Cardensearch | శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌…

Cardensearch | శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌…

  • వివాదాలు, గొడవలకు దూరంగా..
  • ఉంటామంటూ రౌడీ షీటర్ల ప్రమాణం..
  • గత కేసులున్న వారికి అర్బన్ పోలీసుల సూచనలు
  • అసాంఘిక చర్యలపై కఠిన హెచ్చరిక
  • సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి

Cardensearch | నందికొట్కూరు, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్‌ నిర్వహిస్తున్నామని నందికొట్కూర్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నీలి షికారి బస్తీలో పోలీసు సిబ్బంది, కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సైబర్‌ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాల న్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.

Cardensearch |

ద్విచక్ర వాహనదా రులు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఎవరైనా భూకబ్జాలకు, భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలుంటా యని తెలిపారు. నందికొట్కూరు పరిధిల్లో ఎవరైనా అనుమానాస్ప దంగా కనిపిస్తే డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు. నందికొట్కూర్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడతతో వివిధ కేసుల్లో ఇరుక్కొని, తరచూ వివాదాలు, గొడవలకు పాల్పడుతున్న వ్యక్తులకు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఇకపై ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా జీవిస్తామని పోలీసుల ఎదుట వారు ప్రమాణం చేశారు. గతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ సమస్యాత్మక పరిస్థితులకు కారణమైన వ్యక్తులను గుర్తించి, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ తరహా అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఎవరు కూడా గొడవలు, వివాదాలు, భయాందోళనలకు కారణమయ్యే చర్యలకు పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

అవగాహన సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు కూడా ఇకపై శాంతియుతంగా ఉండి, సమాజంలో మంచి పౌరులుగా జీవిస్తామని, పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యలతో నందికొట్కూర్ ప్రాంతంలో శాంతియుత వాతావరణం మరింత బలోపేతం అవుతుందని, ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply