Car Racing | అజిత్ కు మరోసారి తప్పిన ప్రమాదం !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు మరో ప్రమాదం జరిగింది. హీరో అజిత్ ఈ మధ్య కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు. ఓపైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగ్ లలో పాల్గొంటున్నాడు.
కాగా, తాజాగా స్పెయిన్ లో ఓ కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సమయంలో అజిత్ కారుకు ఈ ప్రమాదం జరిగింది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. అజిత్ కు ఎలాంటి గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఇటీవల దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్ లూనూ అజిత్ కారు కు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి అజిత్ తృటిలో తప్పించుకున్నారు. అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.