విద్యార్థులకు గాయాలు
ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై బిట్స్ స్కూలుకు విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులతో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో జిల్లా వంద పడకల ఆస్పత్రికి తరలించారు.

