Candidate | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అవకాశమిస్తే.. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని జాఫర్ గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శాగ సురేష్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో లేడి పర్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. జాఫర్ గూడెం గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. సర్పంచ్ గా తనను ఆశీర్వదించాలని శాగ సురేష్ ప్రజలను కోరారు.
Candidate | జాఫర్ గూడెంను అభివృద్ధి చేస్తా..

