Campaign | శ్రీను రెడ్డి గెలుపుతోనే..
- అంకిరెడ్డిగూడెం గ్రామం అభివృద్ధి
- ఎన్నికల ఇన్చార్జి రమణగోని శంకర్
- ప్రచారంలో ముందున్న శ్రీను రెడ్డి
Campaign | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామం అభివృద్ధి పర్నె శ్రీను రెడ్డి గెలుపుతోనే సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు, చౌటుప్పల్ మండల గ్రామ పంచాయతీల ఎన్నికల ఇన్చార్జి రమణగోని శంకర్ తెలిపారు. అంకిరెడ్డి గూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామునుండే చలిని సైతం లెక్కచేయకుండా సర్పంచ్ అభ్యర్థి పర్నె శ్రీనురెడ్డితో కలిసి కత్తెర గుర్తుపై పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ… అంకిరెడ్డిగూడెం గ్రామం ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గ్రామం అభివృద్ధి కుంటుపడిందని, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామం అభివృద్ధి కోసం సమస్యలు తెలిసిన రైతుబిడ్డ శ్రీను రెడ్డిని సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. గ్రామపంచాయతీలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరుగా నిధులను పంపించడం జరుగుతుందని, గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల సహకారంతో ఎక్కువ నిధులను తీసుకువచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

స్థానికంగా మీకు అందుబాటులో ఉండి సేవ చేసే పర్నె శ్రీనురెడ్డి గెలుపుతోనే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, అంకిరెడ్డి గూడెం గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు అభిమానించే శ్రీను రెడ్డికి కేటాయించిన కత్తెర గుర్తుపై ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజారిటీతో సర్పంచిగా గెలిపించాలని శంకర్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పర్నె శివారెడ్డితో పాటు సర్పంచ్ అభ్యర్థి శ్రీను రెడ్డి కుటుంబ సభ్యులు, బిజెపి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

