Campaign | ఉత్సాహంగా బద్దం హరిత కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం
Campaign | శంకర్ పల్లి, ఆంధ్రప్రభ : శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో ఎన్నికల (Election) ప్రచారాన్ని బద్దం హరితా కృష్ణారెడ్డి ఉత్సాహంగా చేపడుతున్నారు. ఏ తలుపు తట్టి ఓట్లు అభ్యర్థించినా.. వారికి లభిస్తున్న స్పందన వారిని మరింత ఉత్సాహపరుస్తున్నది. సమస్యల వలయంలో ఉన్న గ్రామాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే లక్ష్యంతో మీ ముందుకు వచ్చామని.. నిండు మనస్సుతో ఆశీర్వదించాలని వారు కోరుతున్నారు. గ్రామంలో అన్ని సమస్యలే.. సమస్యలకు కారణం వెతికే దానికన్నా.. రాబోయే రోజుల్లో అవకాశం ఇస్తే గ్రామాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టేందుకు అవసరమనుకుంటే సొంత నిధులను ఖర్చుపెట్టి అయినా సరే గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇంటింటి ప్రచారంలో వారికి అపూర్వ స్పందన లభిస్తున్నది. వారి ప్రచారంలో వ్యక్తిగతంగా వారి సేవలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారు.

