Call 100 | 100కు గానీ, 1908కి గానీ…

Call 100 | 100కు గానీ, 1908కి గానీ…
Call 100 | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : విద్యార్ధులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ మోహన్ బాబు(SI Mohan Babu) అన్నారు. డ్రగ్స్ నిర్మూలన పై నాశా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్తానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో ఎస్ఐ మొహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… డ్రగ్స్, ఆల్కహాల(Drugs, Alcohol)కు విద్యార్థి దశలో బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందని విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి చదివి మంచి పౌరులుగా రాణించాలన్నారు.
డ్రగ్స్, గంజాయి ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు తమ పరిసరాలలో గుర్తించినట్లయితే వెంటనే 100కి కాల్(Call 100) గానీ లేదా 1908 కి గాని తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు అదేవిధంగా విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో తమ వంతు పాత్ర పోషిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బలరాంరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అద్యాపకులు, పోలీస్ సిబ్బంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
