Calendar l ప్రజారోగ్య ప్రచారానికి డెమో విభాగాలు కీలకం..

Calendar l ప్రజారోగ్య ప్రచారానికి డెమో విభాగాలు కీలకం..
హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా అధికారుల సంఘం క్యాలెండర్, దినసరి ఆవిష్కరణ
Calendar l విజయవాడ, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్యా, మాధ్యమ అధికారుల సంఘం (ఏపీఎంఓహె అసోసియేషన్), అమరావతి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ , దినసరిని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. సుహసిని ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో డెమో (ప్రదర్శన) విభాగాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని డాక్టర్ సుహసిని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా ప్రజలకు అందాలంటే డెమో విభాగాల సమన్వయంతో పనిచేయడం అవసరమన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణపై ప్రచారం చేయడం, తల్లి–శిశు సంరక్షణ, టీకాల ప్రాముఖ్యత వంటి అంశాలను మాధ్యమాల ద్వారా విస్తృతంగా తెలియజేయడంలో ఆరోగ్య విద్యా విభాగం కీలకంగా వ్యవహరిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అధికారి (డీపీఎంఓ) డాక్టర్ నవీన్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సాగర్, గణాంక అధికారి లక్ష్మోజి, రాజశేఖర్, బాషా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్యా మాధ్యమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ నాగేశ్వరరావు, కొవ్వూరి ప్రభాకరరెడ్డి, ఎం.ఎం.వై. శ్రీనివాస్, మహ్మద్ యూసుఫ్, శ్రీమతి పుష్పరాణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్యాలెండర్, దినసరి ద్వారా ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని, ప్రభుత్వ ఆరోగ్య సేవలను సమర్థంగా ప్రజలకు చేరువ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

