మహిళలు అన్ని రంగల్లో రాణించాలి…

మహిళలు అన్ని రంగల్లో రాణించాలి…
చెర్ పర్సన్ పద్మ
చెన్నూర్, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి ప్రగతిని సాధించాలని చెన్నూర్ మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింటి పద్మ పిలుపునిచ్చారు. జాతీయ మహిళ దినోత్సవన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొదట కేక్ కట్ చేసి పట్టణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా చెర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాల సాధికారతకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వార మహిళలకు ఉచిత ప్రయాణాసౌకర్యం, స్వశక్తి మహిళకు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, మహిళ క్యాంటిన్లు, పెట్రోల్ బంక్ ల నిర్వహణ లాంటి చేయూతను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను మున్సిపల్ సిబ్బంది ఘనంగా సన్మానిచారు.
