పేదరికం నిర్మూలించడమే లక్ష్యం..

పేదరికం నిర్మూలించడమే లక్ష్యం..

స్వర్ణాంధ్ర లక్ష్యంగా పి4 పథకం…
ఉరవకొండలో ఘనంగా వార్షికోత్సవం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సమాజంలో ఆర్థిక అసమాన తలను తొలగించి, పేదరిక నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని చేపట్టారని ఉరవకొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారిని అఖిల పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేట్, ప్రజల భాగ్యస్వామ్యం పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం ఉరవకొండలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పి4 పథకం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఆ లక్ష్య సాధనలో భాగంగానే ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పి4 పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో రవి ప్రసాద్ మాట్లాడుతూ సమాజం నుంచి లబ్దిపొంది ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు తిరిగి, సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాయం చేసి వారి, జీవితాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు పి4 పథకం ఎంతో ఉపయోగపడు తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా సమాజంలో సమానత్వం, సహకారం పెంపొందుతా యని, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత తీసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

పి 4 పథకం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉరవకొండ నియోజక వర్గంలో మొత్తం 1231 బంగారు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. అలాగే 241 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. పి 4 పథకం ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. చివరగా, సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గత సంవత్సరం ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం గ్రామంలో నిర్వహించిన సమావేశాన్ని అధికారులు గుర్తు చేశారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న విషయం ప్రస్తావించారు. ఆ సమావేశంలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫండ్-ఏ-నీడ్ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. మొత్తం 12 కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 వేల రూపాయలు చొప్పున సహాయం అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చినట్లు
తెలిపారు.

ఈ సహాయం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ప్రస్తుతం ఆర్థికంగా కొంత మెరుగైన స్థితికి చేరుకున్నాయని, స్వయం ఉపాధి మార్గాల్లో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. వారి కుటుంబాల్లో వచ్చిన అభివృద్ధిని సమావేశంలో పాల్గొన్న లబ్ధిదారులు స్వయంగా వివరించి ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి కార్యక్రమాలు సమాజంలో పేదరిక నిర్మూలనకు దోహదపడటం తో పాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నూతన ఆశలను కలిగిస్తున్నాయని తెలిపారు.

చివరగా, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ఎక్కువ మంది లబ్ధి పొందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ తహసిల్దార్ భోగన్న గౌడ్, ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, సిడిపివో శ్రీదేవి, ఎంఈవో ఈశ్వరప్ప, ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయభాస్కర్, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవ, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, కండక్టర్ తిమ్మప్ప, రాంబాబు, యంగ్ ప్రొఫెషనల్, సి వి ఏ పి యూనిట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply