చీకటిలో వెలుగు నింపిన ప్రజా ప్రతినిధులు..

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : బూర్గంపహాడ్ గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులుగా ఇటీవల ఎన్నికై ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిత్యం గ్రామంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని యాదవ బజారులో గొర్రెల కాపరులకు తమ కాలనీలో చివరి వరకు కరెంట్ స్థంభం లేకపోవడంతో చీకటిగా ఉంటుందని గొర్రెల మంద దొంగతనానికి గురవుతున్నాయని, ఎన్నో ఏళ్లుగా చీకటిలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

కరెంట్ స్థంభాలు ఏర్పాటు చేయాలని.. గత పాలకవర్గాలకి, విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మందా నాగరాజు ఉపసర్పంచ్ గుండె వెంకన్నల దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే విద్యుత్ శాఖ వారి కోసం వేచి చూడక విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయాలంటే.. సమయం పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా నైనా సమస్యను పరిష్కరించాలన్నారు.

మంచి ఉద్దేశంతో వారే స్వయంగా లైటును, వైరును తెప్పించి స్వయంగా సామాన్యుడు ప్రజాప్రతినిధి అయితే.. సమస్యను తానే పరిష్కరిస్తారు అనేందుకు ఉదాహరణగా ఇరువురు అప్పటికప్పుడు నిచ్చెన తెప్పించి స్వయంగా గొర్రెల కాపరులకు చీకటి నుంచి వెలుగు రప్పించేందుకు అక్కడ ఉన్న చెట్టుకు లైటును ఏర్పాటు చేయించారు. తాత్కాలికంగా వెలుగును తెప్పించారు. దీంతో కాలనీ ప్రజలు శభాష్ ప్రజాప్రతినిధులు అంటూ అభినందించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా స్థంభాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ మందా నాగరాజు ఉపసర్పంచ్ గుండె వెంకన్నలు కాలనీవాసులకు హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సామాన్యుడు ప్రజాప్రతినిధులు అయితే.. సామాన్యులకు న్యాయం జరుగుతుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాసంఘాలు ఇరువురి ప్రజాప్రతినిధులను అభినందించారు.

Leave a Reply