Arrest | బుల్లెట్ దొంగల ముఠా అరెస్ట్

Arrest | బుల్లెట్ దొంగల ముఠా అరెస్ట్

ఏడాది కాలంగా కొనసాగుతున్న వాహన దొంగతనాలకు చెక్…


Arrest | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్, పల్సర్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శంకర్ రెడ్డి (ACP Shankar Reddy) మీడియాకు వివరాలను వెల్లడించారు. గత ఏడాది కాలంగా మేడ్చల్ పరిధిలో జరుగుతున్న వాహన దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను ఇవాళ ఉదయం కేఎల్ఆర్ వెంచర్ లో అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో13 బుల్లెట్ బైక్లు 5 పల్సర్ బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ దాదాపు రూ.50లక్షల సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు (police) వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో అశోక్ చిన్నశంకరంపేట, మెదక్ జిల్లా సల్మాన్, రాయచూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దొంగతనాల వెనుక పనిచేస్తున్న ముఠాపై మరింత విచారణ చేపడుతున్నట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్ ఐలు నవీన్, మన్మథ రావు, అనిత, కానిస్టేబుల్ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply