షాక్‌తో ఎద్దు మృతి
వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండల సమీపంలోని రాచూర్ తాండాకి చెందిన వర్త్యవత్ ఫకీర కి చెందిన వ్యవసాయ కాడి ఎద్దు శనివారం కరెంట్ షాక్ తో మృతి చెందిందని తెలిపారు.
రైతు తెలిపిన వివరాలు ప్రకారం వ్యవసాయ పొలంలో గడ్డిమేస్తున్న సమయంలో కరెంటు వైరు (Electricity Wire)తగిలి కాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిందని వారు తెలియజేశారు.
వర్త్యవత్ ఫకీర బోరున విలపిస్తూ, ఎద్దు విలువ 70 వేల రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

