Budget | తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు

హైదరాబాద్: రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. వ్యవసాయ శాఖ రూ.24,439 కోట్లు. పశు సంవర్ధకం రూ.1,674 కోట్లు. పౌరసరఫరాల శాఖ రూ.5,734 కోట్లు. విద్యా రంగం రూ.23,108 కోట్లు. కార్మిక శాఖ రూ.900 కోట్లు. పంచాయతీరాజ్ శాఖరూ.31,605 కోట్లు. మహిళా శిశు సంక్షేమ శాఖ రూ.2,862 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ. 40,232 కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు. బీసీ సంక్షేమం రూ. 11,405 కోట్లు. కేటాయించారు.

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు..

రూ.3.20 లక్షలతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
యువతకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉండే ఛాన్స్
తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం
ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం
విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం
రైతుల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది
నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో.. నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అన్న మహత్మా గాంధీ మాటలను గుర్తుచేసిన భట్టి విక్రమార్క
గాంధీ మాటలను పాటిస్తూ ముందుకెళ్తున్నాం.
ప్రజా ప్రయోజనాలే థ్యేయంగా పనిచేస్తున్నామన్న భట్టి
ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది
జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన అందించడంలో సఫలీకృతమయ్యామని భావిస్తున్నాం
తెలంగాణ ప్రజలు మాపై విశ్వాసంతో అధికారం అప్పగించారు
తెలంగాణ ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టలేదు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
కొందరు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
ప్రజలకు నిజం చెప్పకపోతే అవాస్తవాలను నిజాలని నమ్మే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *