Budget | అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా..

Budget | అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా..

  • ప్రజలకు అనుకూలమైన కేంద్ర బడ్జెట్
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

Budget | నిజామాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతా రామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరు తుందని, ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగప డుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదివా రం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. రైతులకు, అలాగే రోజువారి పనులు చేసుకు నే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగదాయకమని ఆయన అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశం మరికొన్ని రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచం లోనే అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ దేశాల సరసన నిల బడడం ఖాయమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉపయోగం చేకూరుతుం దని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను రూపొందించారని ఎమ్మెల్యే కొనియాడారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కల్పితాలను ప్రజలు నమ్మ కూడదని ఈ బడ్జెట్ కేవలం దేశాభివృద్ధి కోసమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a Reply