గిరిజన హాస్టల్‌లో మెనూ గందరగోళం

గిరిజన హాస్టల్‌లో మెనూ గందరగోళం

  • విద్యార్థుల భోజనంపై నిర్లక్ష్యం సహించం
  • కామన్ మెనూ అమలు చేయాలి…
  • వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి
  • గిరిజన హాస్టల్‌లో అవ్యవస్థలు వెంటనే సరిచేయాలి
  • విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దు
  • ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం
  • వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
  • బీఆర్ఎస్వీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్

స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఉన్న ప్రభు త్వ గిరిజన బాలుర వసతి గృహంలో మెనూ పాటించకుండా విద్యా ర్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్వి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ డిమాండ్ చేశారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కామన్ మెనూ అమలు చేస్తున్నప్పటికీ, దాన్ని పూర్తిస్థాయిలో పాటించడం లేదని ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మెనూ సవరణలు చేసి కచ్చితంగా అమ లు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్టేషన్ ఘన్ పూర్‌లో మాత్రం అవి అమలు కావడం లేదన్నారు. కొత్త మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు చికెన్, ఐదు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, బుధవారం, ఆదివారం చికెన్ ఇవ్వా ల్సిన నిబంధనలను పట్టించుకోవడం లేదన్నారు.

విద్యార్థులకు తప్పు దోవ పట్టిస్తూ ఈ రోజు మెనూలో చికెన్, గుడ్డు లేవు అని చెప్పు తున్నారని విమర్శించారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసి నా స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరో గ్యం, పోషణపై నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Leave a Reply