BRS | నిరసన..

BRS | నిరసన..
BRS, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ల నిరసన తెలియచేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పోరేట్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజా సమస్యలతో పాటు భూముల అమ్మకాల పై కౌన్సిల్ లో గట్టిగా నిలదీయాలని గ్రేటర్ ఎమ్మెల్యేకు, కార్పోరేటర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిశా నిర్ధేశం చేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశంలోకి ప్లే కార్డులను తీసుకురావద్దని మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే.. మార్షల్స్ లోపలికి రావడం పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.


