budget 2026 | ప్రభుత్వానిది మూడు ముక్కలాట

budget 2026 | ప్రభుత్వానిది మూడు ముక్కలాట
ప్రజలపై ప్రేమ లేదు
బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైంది
పచ్చి అబద్ధాలు ఆడుతున్న రేవంత్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ సామాన్యులకు ఏ మాత్రం అనుకూలంగా లేదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మూడు ముక్కలాట తప్ప.. ప్రజలపై ప్రేమ లేదని మండి పడ్డారు. బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైతుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం భారతదేశంలో ఏదీ లేదన్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి… నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టారని, ఉచిత బస్సు వల్ల ఆర్టీసీకి లాభాల్లోకి వెళ్లిందని చెబుతున్నారని, ఆర్టీసీ లాభాల్లో ఉంటే… గత రెండేళ్లలో అప్పులు ఎందుకు చేశారు? హరీశ్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బస్టాండ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు దానే ఊసే లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారు… ఇప్పటికీ ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని బస్టాండ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తారేమో అని చూశాం, పింఛన్ల విషయంలో కోత పెట్టారని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో తగ్గిన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ
బీఆర్‌ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 10.2 శాతంకు పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జీఎస్‌డీపీ వృద్ధి 12.50 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో జీఎస్‌డీపీ వృద్ధి 10.07 శాతానికి తగ్గిందన్నారు.
