అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు

అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు

బోర్ పంపు వేయిస్తున్న దృశ్యం

లింగాపురం, ఆంధ్రప్రభ : లింగాపూర్ మండలంలోని పిక్లతండా గ్రామపంచాయతీ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో మంగళవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నిరంజన్ కుమార్ ట్రిబే వాల్ ఆదేశాల మేరకు ఎఫ్ఆర్ఓ సీహెచ్ రమేష్ హీరాపూర్ గ్రామాన్ని సందర్శించి కొత్త బోరు పంపును వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మంచినీటి కొరత తీర్చాలనే ఉద్దేశంతోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో బోరు పంపు వేశామన్నారు.

ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారిని అనూష, బీట్ అధికారి మహేష్, గ్రామస్తులు గుణవంతరావ్, గ్రామ నాయక్ రత్నజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply