Bondi Beach Fatal Attack  :  10 మంది హతం

Bondi Beach Fatal Attack  :  10 మంది హతం

ఆరిన హనుక్కియా దీపాలు

 బీచ్​ లో హాహాకారం .. 10 మంది హతం

తుపాకీ గుళ్ల వర్షంతో జనం ఊచకోత

చావు బతుకుల్లో 12 మంది పర్యాటకులు

(ఆంధ్రప్రభ, సిడ్నీ )

అమెరికాలో బ్రౌన్​ వర్సిటీలో కాల్పులకు తెగబడి ఇద్దరిని హతమార్చిన కిరాతక చర్య గడచిప కొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్​ లో ఆగంతకులు మాస్​ కిల్లింగ్ (Mass Killig)​ తెగించారు. యూదుల ఎంతో ప్రేమతో నిర్వహించే దీపాల పండుగ వేళ..(Lights Festival)  ఈ ముష్కరులు తుపాకులు ఎక్కుపెట్టారు. కళ్లకు కనిపించినోళ్లను కనిపించినట్టు పిట్టల్ని కాల్చనట్టు గుళ్ల వర్షం కురిపించారు.

Bondi Beach Fatal Attack

Bondi Beach Fatal Attack

ఈ ఉగ్రఘాతుక చర్యలో పది మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఈ మృతుల్లో ఒక షూటర్​ కూడ ఉన్నాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో షూటర్​ చావు బతుకుల్లో ఉన్నాడు. యావత్​ ప్రపంచాన్ని కలవర పెట్టిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  సిడ్నీ నగరంలోని  ప్రముఖ పర్యాటక కేంద్రం బోండి బీచ్‌లో ( Bonidi Beach Fatal Attack )  ఆదివారం ఉదయం  5.00 గంటల సమయంలో ( భారత కాలమానం మధ్యాహ్నం 12.20 గంటలకు)  ఈ నరమేదం జరిగింది. యూదుల పండుగ హనుక్కియా సందర్భంగా.. బాండీ బీచ్​ ఆదివారం ఉదయం నుంచే కిటకిటలాడింది.

Bondi Beach Fatal Attack

Bondi Beach Fatal Attack

ఈ రోజు సాయంత్రం దీపాల పండుగ ఈవెంట్ (Lights Event) ​ కు పర్యాటకులు సర్వసన్నద్ధం అయ్యారు. అంతలోనే  భయానక కాల్పుల బీభత్స కాండకు తెరలేచింది. పర్యాటకులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్న  వేళ బీచ్‌లోకి   ఇద్దరు (Two Gun Man)  ముష్కరులు ప్రవేశించారు.   

Bondi Beach Fatal Attack

ఒక్కసారిగా విచక్షణరహితంగా కాల్పులు (Mass Firing)  ప్రారంభించారు. ఈ  భయానక పరిస్థితుల్లో   వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్‌ క్లబ్‌కు సమీపంలోని  ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి పైకి చేరుకుని కాల్పులు జరిపారు. ఆదివారం కావడంతో బాండి బీచ్ కు భారీగా పర్యాటకులు వచ్చారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు వినిపించారు.

Bondi Beach Fatal Attack

Bondi Beach Fatal Attack

ఇద్దరు దుండగులు భారీ గన్ లతో టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఓ వ్యక్తి సాహసం చేసి షూటర్  నుంచి గన్ లాక్కుకున్నారు.  ఇక్కడ ఆదివారం సాయంత్రం జరిగే యూదుల దీపాల పండుగనే టార్గెట్​ చేసుకుని ఈ కాల్పులకు తెగబడినట్టు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి.

ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడిని (One militant Dead)  కాల్చి చంపగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన పర్యాలకులను  కాపాడేందుకు హెలికాప్టర్లు (Helicaptors) , 30 అంబులెన్స్‌ (Ambulancens) లను రంగంలోకి దించారు. . ప్రస్తుతం పరిస్థితిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

Bondi Beach Fatal Attack : ఆరిన దీపాలు

Bondi Beach Fatal Attack

హనుక్కియా  అనేది యూదుల ఎనిమిది రోజుల “దీపాల పండుగ”, ఇది 2,000 ఏళ్ల కిందట  మక్కబీయన్ (Makkabian)  తిరుగుబాటు,  జెరూసలేంలోని రెండవ ఆలయం    పునఃప్రతిష్టను గుర్తుచేసుకునే పండుగ ఇది .  బలవంతపు హెల్లెనైజేషన్‌కు (Anti Hellanization)  వ్యతిరేకంగా యూదుల స్వేచ్ఛ స్థిరత్వంతో ఈ పండుగ జరుపుతారు.

Bondi Beach Fatal Attack

Bondi Beach Fatal Attack

  ప్రతి రాత్రి మెనోరా(Monara) (హనుక్కియా) వెలిగించడం, డ్రీడెల్ ఆడటం, లాట్కేస్ (Latcase) (బంగాళాదుంప పాన్‌ కేక్‌లు)   సుఫ్గానియోట్ (డోనట్స్  (Donuts) వేయించిన ఆహారాన్ని తింటారు.  బహుమతులు వాయినాలు పంచుకొంటారు.  ఇది ఎనిమిది రోజుల పాటు ఒకే రోజు విలువైన నూనెను కాల్చడం యొక్క అద్భుతాన్ని సూచిస్తుంది. చానుకా బై ది సీ కార్యక్రమం బోండి బీచ్​ ఆట స్థలంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి  జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికే ముష్కరులు తెగించారని పర్యాటకులు అనుమానిస్తున్నారు.   ఈ ప్రాంతంలో బాంబు బెదిరింపు కొనసాగుతోందని,   IED లేదా ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరంగా ఉందనే సమాచారంతో భద్రత దళాలు జల్లెడ పడుతున్నాయి.

Bondi Beach Fatal Attack

Bondi Beach Fatal Attack

  బోండి బీచ్‌లో హృదయ విదారక దృశ్యాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  సముద్ర తీరంలో జనం  చెల్లాచెదురుగా పడి పోయారు, తుపాకీ కాల్పులు, పోలీసు సైరన్‌లు ఈ వీడియోల్లో కనిపించాయి. క్షతగ్రాత్రులకు పారామెడిక్స్ సాయం చేస్తున్నారు.  ప్రజలు ఆ ప్రాంతం నుండి పారిపోతున్నట్లు, మరికొందరి తలలపై బ్యాండేజీలు ధరించి ఉండగా, మరికొందరు రక్తంతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపించింది. బోండి బీచ్ ఉత్తర చివరలో,  బోండి పార్క్ ప్లేగ్రౌండ్ సమీపంలో   సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

ALSO READ : In America Man Hunt  : ఉన్మాది  కాల్పులు

Leave a Reply