iran| మ‌ర‌ణ‌మృదంగం

iran| మ‌ర‌ణ‌మృదంగం

ఇరాన్‌లో బాంబుల మోత‌
ఆ దేశంలో 787మంది మృతి
ఇజ్రాయెల్‌- అమెరికా దాడులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్‌లో మరణించిన వారి సంఖ్య 787కు చేరిందని ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న నేప‌థ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించింది.

Leave a Reply