తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటన ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కేరళ మఖ్యమంత్రి కార్యాలయం ‘క్లిఫ్ హౌస్’, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆఫీస్‌లో సహా పలు కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మే 2న కేరళను సందర్శించి విజింజం అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. జూలై 2024లో ఓడరేవు ట్రయల్ రన్ నిర్వహించి డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఓడరేవు ప్రాజెక్టు ఆపరేషన్‌తో పాటు కంట్రోల్ సెంటర్లను సందర్శించారు.