Bodhan | గృహజ్యోతి లబ్ధిదారులకు పత్రాల పంపిణీ

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : గృహ జ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్న వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ కో సిబ్బంది ద్వారా లబ్ధిదారు పత్రాలను పంపిణీ చేయి స్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అందిస్తున్న లబ్ధిని వివరిస్తూ రూపొందించిన పత్రాన్ని వినియోగదారులకు అందజేస్తున్నారు.

రాష్ట్రంలో 52 లక్షల 82 వేల 498 మంది వినియోగదారులు గృహ జ్యోతి పథకంలో లబ్ధి పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ. 3,593 కోట్లు ఖర్చు చేస్తుంది. గృహజ్యోతిలో మినహాయించిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. లబ్ధిదారుడి పేరు గృహ జ్యోతి సర్వీస్ నెంబరు ఉన్న ఈ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

Leave a Reply