సీఎం రేవంత్‌రెడ్డితో బీఎన్‌ఐ ప్రతినిధులు భేటీ..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి బీఎన్‌ఐ సంస్థ (బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్) ప్రతినిధులు వివరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు అనిరుద్ కొణిజేటి తదితరులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ మేరకు ముఖ్య మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
