Black Mailer | మ‌త్తు ఇచ్చి అత్యాచారం … ఆపై కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్

హైద‌రాబాద్ – మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 7లో నివాసం ఉంటున్న మహేంద్ర వర్ధన్‌కు రెండేళ్ల క్రితం ఫేస్‌బుల్‌లో మహిళతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఓయూలో కలుసుకున్నారు. వారిమధ్య స్నేహం ప్రారంభమయింది.

కాగా ఏడాదిన్నర క్రితం తన ఇంటికి భోజనానికి పిలిచిన మహేంద్రవర్ధన్‌ ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. మహిళ మత్తులోకి జారుకున్న తర్వాత లైంగికదాడికి పాల్పడడంతో పాటు వీడియో, ఫొటోలు తీశాడు. అప్పటినుంచి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు గుంజుతున్నాడు. ఇప్పటివరకు రూ.20లక్షలు వసూలు చేసిన మహేంద్రవర్ధన్‌ తనకు రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ వేధింపులు భ‌రించ‌లేక బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో అత‌డిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.

Leave a Reply