నార్సింగికి అసెంబ్లీ హోదా ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో నార్సింగిని ప్రత్యేక అసెంబ్లీగా ప్రకటించాలని బీజేపీ మండల శాఖ డిమాండ్ చేసింది.
నార్సింగి చుట్టుపక్కల రామాయంపేట, చేగుంట, శంకరంపేట, మాసాయిపేట, నిజాంపేట, దౌల్తాబాద్ మండలాల గ్రామాలు సమీపంలో ఉండటం, 44వ జాతీయ రహదారిపై ఉండటం, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం వంటి సౌకర్యాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో అధిక ఓటర్లు, జనాభా ఉన్న నేపథ్యంలో నార్సింగికి అసెంబ్లీగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ నార్సింగికి కొత్త నియోజకవర్గం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నార్సింగి అసెంబ్లీ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడించారు.
