నార్సింగిలో సేవా కార్యక్రమాలతో బీజేపీ సంబరాలు

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కుమ్మరి నర్సింలు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎంపీ రఘునందన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా బిజెపి శ్రేణులు పాల్గొన్నారు

Leave a Reply