Bjp l అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం…

Bjp l అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం…
ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రాజకీయ డ్రామా..
బిజెపితోనే అభివృద్ధి సాధ్యం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్రావు
Bjp l నిజామాబాద్, ఆంధ్రప్రభ: ప్రధాని మోదీ నాయకత్వం లో దేశాన్ని అవినీతి రహిత దేశంగా తీర్చిది ద్దడమే జాతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తో నే అభివృద్ధి సాధ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామ చంద్ర రావు అన్నా రు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థి కోరారు. 48వ డివిజన్ ప్రసన్న శ్యా మల సత్యపాల్, 34వ డివిజన్ బంటు ప్రీతి ప్రవీ ణ్, 47వ డివిజన్ గిరి బా బు,49 వ డివిజన్ కూ తురు వినోద గోపి, 44వ డివిజన్ బట్టు రాఘ వేంద్ర వివిధ వివిధ అన్న బిజెపి అభ్య ర్థుల ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన పూస ల గల్లీ చౌరస్తా లో నిర్వహించిన కార్యక్ర మానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, పసు పు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి , నిజామాబాద్ ఇన్చార్జి వివిఎస్ ప్రభాకర్ లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
చేనేత వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో ముఖ్య అతిథుల ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా బిజెపి రాష్ట్ర అధ్య క్షులు రామచందర్ రావు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ తర్వాత నిజామాబాద్ పేరు కాస్త ఇందూరుగా మారనుందని నాకు పూర్తి నమ్మకం ఉం దన్నారు. ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాంగ్రెస్ కల్లబొల్లి మాయ మాటలు చెప్పి ప్రజలను వంచి స్తుందని మండిపడ్డారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ కు బ్రోక రిజం చేసేది ఎంఐఎం అని విమర్శించారు. బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసిన ఎంఐఎం కు వేసినట్లేనని నొక్కి చెప్పారు. గతంలో కేసీఆర్ నిజం పరిపాలన చేశాడన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, డిక్ల రేషన్ లను మర్చిపో యావు కానీ కాంగ్రెస్ మజి లీస్ ఒకటేనని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేవ లం ఓటు బ్యాంకు రాజ కీయాల కోసమే రేవంత్ రెడ్డి డ్రామా ఆడు తు న్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.రహదారిలో స్ట్రీట్ లైట్లు అన్ని కేంద్రం నుంచి వచ్చినవెనని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేసు కుందామని పిలుపుని చ్చారు. కార్పొరేషన్ లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మున్సిపాలిటీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తా వని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ లెక్కన కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రజల పై పన్ను భారం పడ నుందని తెలిపారు. అదే విధంగా ఓవైసీ చేస్తున్న వంటి వ్యాఖ్యలపై మండి డిపడ్డారు. బిఆర్ఎస్ సచ్చిపోయిన పాము అని బిఆర్ఎస్ పై మాట్లాడడం వేస్ట్ అని అన్నారు. తెలం గాణ ప్రజల్ని దోచుకుం దెవరో ప్రజలకు తెలు సు నని అన్నారు. బిఆ ర్ఎస్ దొంగ అయితే.. కాంగ్రెస్ దోపిడీకి దొంగగా మారిం దని విమర్శించారు. కెసి ఆర్ రాహువు ఐతే రేవంత్ రెడ్డి కేతువుగా రారని వీరి నుంచి ప్రజలు బయట పడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం దోపిడిమయ మైం దని వ్యాపారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు రాష్ట్రా నికి రాకుండా చేస్తున్నారని అన్నారు. బిజెపి ఎప్పుడు మతం కోసం మాట్లాడదని సబ్కా సార్ సబ్కా వికాస్ అని అన్నారు. అటల్ బిహారీ నాయకత్వంలో అప్పట్లో రాష్ట్రపతిగా అ బ్దుల్ కలాంని చేసిన ఘన త బిజెపి దినని ఈ సం దర్భంగా గుర్తు చేశారు. ఎంఐఎం మాటలు అదు పులో ఉంచుకోవాలని హితవు పలికారు. ఇం దూర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఢిల్లీలో కాదు గల్లీలో బిజెపికి ఓటు వేసి గెలిపించండి..
ఎంపీ ధర్మపురి అరవింద్
ఢిల్లీలో కాదు గల్లీలో ఓటు వేసి భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఇందూరు ప్రజలదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నా రు. కల్లబొల్లి మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దని అన్నారు. ఇలా ఎన్నిసార్లు అభివృద్ధి చేతగాని వారి చేతిలో మోసపోతారని ఇప్పటికైనా ఇందూరు ప్రజలు ఆలోచించి బిజెపిని గెలిపించాలని ఎంపీ కోరారు.
ధర్మానికి, అధర్మానికి మధ్య నడుస్తున్న ఎన్నికలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ధర్మానికి అధ ర్మానికి మధ్య నడుస్తున్న ఎన్నికలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్య నారా యణ అన్నారు. గత ఎన్నికల్లో కల్లబొల్లి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీ లను పూర్తిగా మరిచి పోయిందని ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నియో జకవర్గానికి వచ్చే ఎమ్మె ల్యే ఫండ్ కూడా 26 నెలల నుంచి ఒక్క రూపా యి రాలేదన్నారు. కాం ట్రాక్టర్ లకు నిధులు రాక కళాభారతి నిర్మాణం పూర్తి కాలేదన్నారు. పిసిసి అధ్యక్షుడు అయిఉండి. నువ్వు నిజామాబాద్ చేసింది ఏమి లేదనీ మం డిపడ్డారు.బిఆర్ఎస్ గ తంలో చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ లేదన్నారు. ఇందూరు రూపురేఖలను ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఇందూర్ ప్రజలు బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఇందూరు ప్రజలదని అర్బన్ ఎమ్మెల్యే కోరారు. ఇందూర్ తలరాతను మార్చే సమయం మీ చేతిలోనే ఉందని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్ర మంలో వివిధ డివిజన్లో అభ్యర్థులు బిజెపి నాయ కులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
