ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు

విశాఖపట్నం,ఆంధ్రప్రభః ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) ముత్తా గౌతమ్ గారి పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక విశాఖ యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, బ్యూరోచీఫ్ గంట్ల శ్రీనుబాబు కేక్ కట్ చేసి అందరికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ రాజధాని దిల్లీ , మెట్రోపాలిటిన్ నగరాల్లో ఆంధ్రప్రభ నిరంతరం పాఠకుల మదిలో చెరగని ముద్ర వేసిందన్నారు.

1938లో ఆవిర్భవించిన ఆంధ్రప్రభ స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. అటువంటి తెలుగు జాతీయ దినపత్రిక సంస్థ ఛైర్మన్ ముత్తాగోపాలకృష్ణగారు, ఎండి ముత్తా గౌతమ్ గార్ల సారధ్యంలో వందేళ్ల పండుగ నిర్వహించుకోనుండడం అభినందనీయమన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తెలుగుపత్రికల జాబితాలో ఆంధ్రప్రభ ముందువరుసలో ఉంటుందన్నారు. సుమారు 4వేల మంది ఉద్యోగులతో ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక, రెండు స్మార్ట్ ఎడిషన్ లు, ఐదు యూట్యూబ్ చానల్స్, వెబ్ చానల్ తో పాటు జాతీయ స్థాయి చానల్ ను ముత్తా గౌతమ్ పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ కోట్లాది మంది పాఠకులకు పత్రిక, ఛానల్ ను మరింత చేరువ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ యూనిట్ సహాయ మేనేజర్ చిరికి దేముడునాయుడు, అకౌంట్స్ ప్రతినిధి ఏ ఉదయ్, స్ఠాప్ రిపోర్టర్ సిద్దార్ధ,కృష్ణమూర్తినాయుడు, సీనియర్ పాత్రికేయులు, డెస్క్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు , ఇతర పాత్రికేయులు పాల్గొని ముత్తాగౌతమ్ మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply