Dandepally | బిర్సా ముండా జయంతి వేడుకలు
Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి (Dandepally) మండలం తాళ్లపేట గ్రామంలో తుడుందెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజన వీరుడు బిర్సా ముండా (Birsa Munda) జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కనక జంగు, నాయకులు అడయి కాంతరావు, తొడసం జంగు, హనుమంతరావు, లచ్చు పటేల్, లక్ష్మణ్, మారు, భీమయ్య, రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

