Bikkanoor | ప్రజాసేవకే జీవితం అంకితం…
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు పెద్ద బచ్చ గారి సరిత నరసింహారెడ్డి అన్నారు. పట్టణ సర్పంచిగా పోటీ చేస్తున్న ఆమె పట్టణంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కులసంఘాలు, యువజన సంఘాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి. అనంతరం మాట్లాడుతూ… ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. తమను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా తమను ఆశీర్వదించాలని కోరారు.

