బీహార్ పోలింగ్ అప్ డేట్..

బీహార్ పోలింగ్ అప్ డేట్..

బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121 నియోజవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతతో ఈ పోలింగ్ ని నిర్వహిస్తున్నారు. మిథిల, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పట్నాలోని పోలింగ్ బూత్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లి రబ్రీదేవి, సతీమణి రాజశ్రీ యాదవ్, సోదరి మీసా భారతితో కలిసి మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బీహార్ లోని బరేయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply