Bihar | ఎమ్మెల్సీ పదవికి…

Bihar | ఎమ్మెల్సీ పదవికి…
త్వరలో సీఎం పదవికి కూడా గుడ్‌బై?
Bihar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసన మండలి కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం.
ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నీతీశ్ కుమార్ రాజీనామా చేస్తే, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
