Big Boss | వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు!

Big Boss | వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు!
- Big Boss | రీతూ, కళ్యాణ, పవన్ మధ్య మాటల యుద్ధం.. సంజాన మాటలకు రీతూ కన్నీరు
Big Boss | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్‌లో ఈ వారం వాగ్వాదాలు.. ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గత వారం బాండింగ్ తో ముందుకు వెళ్లిన ఇంటి సభ్యులు ఈ వారం తన పంథా మార్చుకున్నారు. బాండింగ్ నుంచి ఇంటి సభ్యులు బయట పడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత వారం ఇంటి సభ్యుల ఫ్యామలీ మెంబర్స్‌ను బిగ్‌బాస్ హౌస్(Bigg Boss House)లోకి అవకాశం ఇచ్చారు. అయితే ఫ్యామలీ మెంబర్స్ ఇచ్చిన సలహాలు, సూచనలు మేరకు బిగ్‌బాస్ ఇంటి సభ్యులు తమ పంథా మార్చారు. ఇదే వాగ్వాదాలకు, ఘర్షణలకు దారి తీసింది.
12వ వారం…
ప్రస్తుతం 12వ వారం నడుస్తోంది. ఈ వారం మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ చేపట్టింది బిగ్ బాస్. ఇప్పటి వరకు నామినేషన్ల ప్రక్రియ ఒక ఎత్తు అయితే. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మరో ఎత్తు. దీనికి తోడు గత వారం ఇమ్మాన్యూల్ పవర్ అస్త్ర వినియోగించడంతో ఎలిమినేషన్ రద్దయింది. దీంతో ఈ వారం ఇద్దరిని ఎలిమినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్‌ని(Nominations) రెండు భాగాలుగా బిగ్‌బాస్ డివైడ్ చేశాడు. ముందు సీక్రెట్ నామినేషన్స్ చేయించి వాటిని బ్యాలెట్ బాక్స్‌లో వేయించాడు. ఇక తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్స్ చేపట్టాడు బిగ్‌బాస్.
దివ్య రెస్పెక్ట్ ఇవ్వు…
భరణి నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తూ దివ్యకు వేసి పాయింట్లు చెబుతున్నాడు. ‘ మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది.. ‘అంటూ తన పాయింట్స్ చెప్పాడు భరణి. వీటిని డిఫెండ్ చేసుకుంటూ దివ్య కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. ‘ప్రతిసారి నేను మీలా అన్నీ సాఫ్ట్‌గా డీల్ చేయను.. నాకు ఒక పాయింట్‌లో నేను వాయిస్ రెయిజ్(Voice Raise) చేయాలి.. నేను గట్టిగా మాట్లాడాలి ‘అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడుతాను.. అంటూ దివ్య చెప్పింది.
ఈ క్రమంలో భరణి సడెన్‌గా రెస్పెక్ట్(Sudden Respect) ఇవ్వు దివ్య.. అంటూ భరణి మండిపడ్డాడు. తాను ఇక్కడ ఎవరినీ అగౌరవవ పరచలేదు.. అని దివ్య చెప్తుంటే ఫింగర్ చూపించి మాట్లాడకు దివ్య.. అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తనూజ వెర్సెస్ ఇమ్మూ..
తనూజను ఇమ్మానుయేల్ నామినేట్ చేశాడు. ‘ఇమ్మూ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు.. తనకి కెప్టెన్సీ విలువ తెలీదు.. అని నువ్వు చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు.. ‘అని ఇమ్మూ తన పాయింట్ చెప్పాడు. ‘నువ్వు చేసిందే కదా నేను చెప్పాను..’ అని తనూజ అనగానే త్యాగం చేస్తే నీకు ఏమైంది.. అంటూ ఇమ్మూ ప్రశ్నించాడు.
‘ఇప్పుడు ఒకసారి త్యాగం చేసిన మనిషి మళ్లీ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నేను కెప్టెన్ అవ్వాలనుకున్న దాంట్లో తప్పేముంది ‘అని తనూజ అడిగింది. నిన్ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పిస్తూ ఆరుగురు నామినేట్ చేశారు.. నువ్వు దివ్యతో డిఫెండ్ చేశావు.. దాని తర్వాత సుమన్, భరణితో నువ్వు డిఫెండ్ చేయలేదు.. మళ్లీ నేను రాగానే తనతో డిఫెండ్ చేశావ్.. అంటూ అడిగాడు ఇమ్మూ.
నీ వల్లే నాకు కెప్టెన్సీ పోయింది…
తనూజను సుమన్‌శెట్టి నామినేట్ చేశాడు. నీ వల్ల నాకు కెప్టెన్సీ పోయింది.. అంటూ సుమన్ శెట్టి పాయింట్ పెట్టాడు. ఒక నిమిషం ఉన్నాను ఫ్లాగ్ పట్టుకొని అవునా కాదా.. అంటూ సుమన్ అడిగాడు. నేను మీకు ఎనర్జీ సరిపోక, అందక ఎక్కి సెట్ చేసుకోండి అన్నానే కానీ.. ఎక్కి సెట్ చేసుకో అనలేదు.. అంటూ తనూజ రిప్లయి ఇచ్చింది. ఎక్కెయ్ ఎక్కెయ్ అన్నావ్.. అని సుమన్ గుర్తు చేశాడు.
దీనికి తనూజ మాట్లాడుతూ సుమన్ అన్నా ఎప్పుడు మీరు బ్రేక్(Break) చేస్తారో ఈ సేఫ్ గేమ్.. తనూజ అన్నాది. సేఫ్ అనేదే తన ఆటలో లేదు తెలుసు అందరికీ.. అంటూ సుమన్ శెట్టి సమాధానం ఇచ్చాడు.
కళ్యాణ్, రీతూ మధ్య మాటల యుద్ధం..
ఇమ్మూను పవన్ నామినేట్ చేస్తూ పాయింట్లు పెట్టాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీమ్ కోసం నువ్వు ఆడుతావని అనడం వల్లే నీకు సపోర్టు చేయలేదని ఇమ్మూ అన్నాడు. ఆట మార్చుతానని నేను చెప్పినా కళ్యాణ్ టీమ్(Kalyan Team) కోసం ఆడుతానని చెప్పాడు. అప్పుడు కళ్యాణ్ కూడా టీమ్ కోసం ఆడుతామని అందరూ అనుకున్నామన్నారు.
ఇంతటిలో రీతూ జోక్యం చేసుకుని అప్పుడు పవన్ లేడని, పవన్‌కు తెలియదని అతనకు సపోర్టుగా రీతూ మాట్లాడింది. నిన్ను సపోర్టు చేయడానికి మాత్రమే వాడు గివ్ అప్ ఇచ్చాడని కళ్యాణ్ అన్నాడు. దీంతో పవన్, కళ్యాణ్, రీతూ ముగ్గురు మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు ఘర్షణకు దారి తీసింది. ఇంతలో మిగిలిన సభ్యులు జోక్యం చేసుకున్నా… రీతూ, కళ్యాణ్ ఎక్కడా తగ్గకుండా తమ మాటల యుద్ధం కంటిన్యూ(Continue) చేశారు. ముగ్గురు మధ్య ఎలాంటి ఘర్షణ జరుగుతుందో ఉత్కంఠభరితమైన వాతావారణం కూడా కనిపించింది. అక్కడ ఉన్నచిన్న టేబుల్ కూడా కింద పడిపోయింది.
రీతూ కన్నీరు!..
ఎప్పుడూ నవ్వుతూ ఉన్న రీతూ 78వ రోజు జరిగిన నామినేషన్ బిగ్‌బాస్ హౌస్‌లో కన్నీరు పెట్టింది. సంజానకు నామినేట్ చేస్తూ మీ ఆట కనిపించడం లేదని, సేఫ్ గేమ్ ఆడుతున్నారని రీతూ అనడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మాటల యుద్ధంలో నీ అంతా పెద్దపెద్ద బూతులు ఎవరూ వాడటంలేదని సంజనా అనడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. నీ అంతా సేఫ్ గేమ్ ఎవరూ ఆడటం లేదని అంటూ పవన్‌తో రాత్రి కూర్చుంటావు అని రీతూ ఉద్దేశించి సంజాన మాట్లాడింది.
దీంతో రీతూ కన్నీరు పెట్టుకుంది. ఈ మాట కరెక్టు కాదని ఇమ్మూ, భరణి చెప్పినా సంజనా వినలేదు. రీతూ కూడా ఆడపిల్ల.. ఇలాంటి మాటలు అనొద్దు అని ఇమ్మూ, భరణి, తనూజ, దివ్య కూడా చెప్పారు. చివరిలో పవన్ మంచి ఫ్రెండ్ మీకు ఏమైనా ప్రొబ్లెమ్ ఉందా? రీతూ(Ritu) కన్నీరు పెట్టుకుంది. తనూజ జోక్యం చేసుకుని తప్పు చేయని నీవు కన్నీరు పెట్ట వద్దని రీతూకు చెప్పింది.
