Bhimgal Rural | గెలిపించండి..కష్టాలు తీరుస్తా

Bhimgal Rural | గెలిపించండి..కష్టాలు తీరుస్తా
- బాబాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంఏ.సూర్జిల్
Bhimgal Rural | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : అంకిత భావంతో ప్రజా సేవ చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని బాబాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంఏ.సూర్జిల్ కోరారు. మహమ్మద్ సూర్జిల్ సర్పంచ్ గెలిసి గ్రామాభివృద్ధే చేయాలని ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మహమ్మద్ సూర్జిల్ అన్నారు. తనకు గ్రామస్తులు ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.తాను గ్రామ ప్రజల కష్టసుఖాలను దగ్గరుండి చూస్తూ పెరిగానని, బాబాపూర్ గ్రామంలో ఎంపీటీసీ అనుభవంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ లుగా ఎన్నికయ్యారని అన్నారు. తనను కూడా ఆదరించి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని కోరారు.
గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.గడపగడప తిరుగుతూ ఓటర్లు తమ ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కొనియాడారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్ కో-ఆప్షన్ ఆప్షన్ నెంబర్ మొయిజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వకీల్, షబాతుల్లా, మహమ్మద్ గౌస్, మహమ్మద్ మన్నాను,షకీల్, ముస్తఫా, మద్దదారులు తదితరులు పాల్గొన్నారు.
