Bheemgal | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

Bheemgal | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
- మెనూ ప్రకారం భోజనం అందించాలి…
- చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి..
- మిషన్ భగీరథ నీళ్లు అందేలా దృష్టి పెట్టాలి…
Bheemgal | భీమ్గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ రోజు సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి, ఇంకనూ ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకబు చేశారు. పెండింగ్ లో ఉన్న సివిల్ వర్క్స్ వేగవంతంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహారీ గోడ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, బాలికల భద్రత కోసం వెంటనే ప్రహారీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు.
అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను ఆదేశించారు. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ, పక్కాగా విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.
