చైర్మన్ గా బోదిరే నాగమణి

చైర్మన్ గా బోదిరే నాగమణి

భీంగల్ టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ) : భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ‌ ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీంగల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గా 6 వ వార్డు కౌన్సిలర్ బోదిరే నాగమణి, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ సంటి లతను ఎన్నుకున్నారు.

మొదటి మూడు ఏండ్లు చైర్మన్ గా బోదిరే నాగమణి, చివరి రెండేండ్లు చైర్మన్ గా ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర, వైస్ చైర్మన్ గా మొదటి రెండేండ్లు సంటి లత, చివరి మూడేండ్లు రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత పదవి కాలం చేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Leave a Reply