నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : జాతీయ పసుపు బోర్డుకు కార్యదర్శిగా ఎన్.భవాని (ఐఏఎస్) నియమితులయ్యారు. ఈ మేరకు 2017వ బ్యాచ్ నాగాలాండ్ కేడర్ కి చెందిన ఎన్.భవాని (ఐఏఎస్)ను జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నియమించినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం తెలిపారు.
సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్ ఎ.బి. రెమాశ్రీ, సుగంధ ద్రవ్యాల బోర్డు జాతీయ పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తారు.
