గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 18
యదా వినియతం చిత్తమ్
ఆత్మన్యేవావతిష్ఠతే |
ని:స్పృహ: సర్వకామేభ్యో
యుక్త ఇత్యుచ్యతే తదా ||
తాత్పర్యము : యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటిని నియమించి, విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచినప్పుడ యోగము నందు స్థిరుడైనట్లుగా చెప్పబడును.
భాష్యము : ”యుక్త” అనే స్థితిని ఇక్కడ చక్కగా వివరించారు. పరిపక్వస్థితిలో యుక్త అనగా మైథునవాంచతో సహా ఎటువంటి భౌతికమైన కోరికలు లేకుండుట. అందరికీ కోరికలు ఉంటాయి. ఇంద్రియాలను మనస్సునను కట్టివేయలేము. అలా అని అందరూ సన్యాసము స్వీకరించలేరు. ఇక్కడ అంబరీష మహారాజు గృహస్థ జీవనములో ఏవిధముగా కృష్ణ చైతన్యములో ”యుక్తు” డుగా ఉన్నాడో తెలిసికొనుట ముఖ్యము. ఆయన తన మనస్సును కృష్ణుని పాదాలను స్మిరంచుటలోను, కోరికలను, ఇంద్రియాలను, వాక్కులను భగవంతుని సేవలను చేయటంలోను యుక్తము చేసేవాడు. ఇలా అందరికీ సులభ మార్గాన్ని ఆయన ఆదర్శవంతముగా చూపాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవ ద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మసన్న్యాసయోగోనామ పంచమోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి ాభక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..
Bhagavatgita | గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 18
