AP | నిరుపేదలకు మెరుగైన వైద్యం .. ఎమ్మెల్యే కొలికపూడి

(తిరువూరు, ఆంధ్రప్రభ) : నిరుపేదలందరికీ అత్యవసర సమయంలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని 88మంది లబ్ధిదారులకు 38లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.

ఈసందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… నిరుపేదలందరికీ అత్యవసర సమయంలో కార్పొరేట్ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ఎస్ ద్వారా వేల కోట్ల రూపాయలతో మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడం జరిగిందన్నారు. ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే సంవత్సర కాలంలో రెండు కోట్ల 12 లక్షల రూపాయల నిధులను లబ్ధిదారులంద‌రికీ అందించడం జరిగిందన్నారు.

నిధులు కేటాయించడంలో సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో ఎవరికీ కనీస ప్రభుత్వ వైద్యం కూడా అందలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి కూడా వైద్యం కోసం అందించలేదన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరిలో ప్రతి వార్డులో ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను స్వయంగా మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే కొలిక‌పూడి హామీ ఇచ్చారు.

Leave a Reply