Best Award | ఉత్తమ పురస్కారం..

Best Award | ఉత్తమ పురస్కారం..
- ఎన్నికల అధికారులకు కలెక్టర్ అభినందనలు
Best Award | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపట్టిన ఓటర్ జాబితా స్వచీకరణకు సంబంధించి జిల్లాలో ఇరువురికి ఉత్తమ పురస్కారం లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ఈ నెల 25న నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు. కె. రామ్ మురళీమోహన్ తోపాటు ఆలూరు నియోజకవర్గం. బీఎల్‌ఓ కే లక్ష్మణులు పురస్కారం అందుకోనున్నారు. ఉత్తమ పురస్కారానికి ఎంపికైన వారిని జిల్లా కలెక్టర్. జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ అభినందించారు
