Bellampalli l ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం..

Bellampalli l ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం..
బ్యాట్ గుర్తుకు ఓటేయండి, నన్ను కౌన్సిలర్ గా ఎన్నుకోండి!
2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నిచ్చకోల వంశీకృష్ణ
Bellampalli l బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడే చివరి రోజున బెల్లంపల్లి 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నిచ్చకోల వంశీకృష్ణ నిర్వహించిన భారీ ముగింపు ర్యాలీతో వాతావరణం హోరెత్తింది. వందలాది మంది మద్దతుదారులు, యువత, వార్డు ప్రజలతో కలిసి సాగిన ర్యాలీలో వంశీకృష్ణ పాల్గొని తనను కౌన్సిలర్‌గా ఎన్నుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. “వార్డు ప్రజల కష్టసుఖాల్లో నేనున్నాను. మీ ఇంటి బిడ్డగా భావించి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజాసమస్యల పరిష్కారమే నా ఏకైక ధ్యేయం” అని ఆయన పిలుపునిచ్చారు. 2వ వార్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో వెనకబడి ఉందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కోసం చిత్తశుద్ధితో పోరాడుతానని హామీ ఇచ్చారు. “అభివృద్ధే నా ఆశయం – సంక్షేమమే నా సంకల్పం. ప్రధాన పార్టీల అభ్యర్థులు వస్తారు.. పోతారు.. కానీ మీ సమస్యల్లో నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మన వార్డుకు నిజమైన మార్పు రావాలని , ఆ మార్పు కోసమే తాను బరిలో నిలిచానని పేర్కొన్నారు. చివరగా, “నా ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి” అంటూ ఓటర్లను వంశీకృష్ణ హృదయపూర్వకంగా కోరారు.
