ప్రపంచ అందెగత్తెలు ఈరోజు ప్రగతి రిసార్ట్స్ సమీపంలోని ఎక్స్‌పీరియం ఎకో-టూరిజం పార్క్‌ను సందర్శించారు. 24 మంది మిస్ వరల్డ్ పోటీదారులు 250 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఎకో-పార్క్‌ను సందర్శించారు.
మిస్ వరల్డ్ పోటీదారులు ఎక్స్‌పోరియం వద్దకు చేరుకోగా… వారికి సాంప్రదాయ వైభవంలో ధోల్ దరువులతో స్వాగతం పలికారు. పోటీదారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఆ తరువాత పార్క్‌లోని సన్‌డౌనర్ పాయింట్, బుద్ధ ఇన్‌సైడ్ ట్రీ స్పాట్, రెడ్ టెయిల్ ఫార్మేషన్ స్పాట్, ఓవల్ ట్రీ స్పాట్, ఈజిప్షియన్ రాక్ స్పాట్ వంటి ప్రదేశాలను సందర్శించారు సుందరీమణులు.
ప్రతి ప్రదేశంలో పర్యావరణ పర్యాటక అద్భుతం సామరస్యాన్ని సంగ్రహిస్తూ ఫోటోలు తీగారు. పార్క్ దార్శనికత, అమలు పట్ల తమ విస్మయం, ప్రశంసలను వ్యక్తం చేశారు.















