చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం…

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం…

అయ్యప్ప స్వామి దేవాలయం రోడ్డు నిర్మాణం పై హర్షం వ్యక్తం చేసినకాలనీవాసులు

కోడూరు – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కోడూరు మండలంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కృషితో అనేక సీసీ రహదారులు నిర్మాణాలు చేపట్టడంతో పాటు బీట్ రోడ్డు నిర్మాణాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్యతెలిపారు. గురువారం నాడు కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

కోడూరులోని రామారావు చెరువు వద్ద నుండి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర వరకు 22 లక్ష రూపాయలతో బీట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఈ రోడ్డు నిర్మాణం వేగవంతంగా నాణ్యతగా జరిగిందని, ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాదుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. కాలనీవాసులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎమ్మెల్యే మండలి కృషితో ఈ రహదారి నిర్మాణం జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షుడు కోట రాంబాబు, కోడూరు పిఎస్పీఎస్ చైర్పర్సన్ పూతబోయిన కరుణ్ కుమార్, మాజీ తెలుగు యువత అధ్యక్షులు బడే గాంధీ, మాజీ ఎంపీపీ పెద్ది భాస్కరరావు, మాజీ ఎంపిటిసి బడే వీరబాబు, గోగినేని సోమశేఖర రావు, ముద్ధినేని చందర్రావు, కాగిత రామారావు, జరుగు సురేష్, అప్పిగట్ల వినోద్, చందు రామాంజనేయులు, బచ్చు పూర్ణచంద్రరావు, జరుగు కిరణ్,, ఇంకొల్లు అశోక్ మహారాజ్ తో పాటు పలువురు నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply