సంగారెడ్డిలో…
అన్ని పార్టీల మద్దతుతో సంగారెడ్డి బంద్ సంపూర్ణం
మద్దతు ప్రకటించిన డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి
ఉదయం నుంచి బందు పాటించిన వ్యాపారస్తులు, మీ సిజేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుట ఆందోళ
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): 42 శాతం బీసీ రిజర్వేషన్ల (BCReservation) కోసం సంగారెడ్డి జిల్లా బీసీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పలుకుల సంఘాలు, ప్రజాసంఘాలు ఉదయం నుంచే రహదారుల వెంట తిరుగుతూ బందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బలుపు సహకరించారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి డిపోలో ఆర్టీసీ కార్మికులు బంద్ సందర్భంగా విరామం జంటలతో యోగాసనాలు, వ్యాయామం చేశారు.
రాహుల్ గాంధీ చొరవతోనే రిజర్వేషన్ల అంశం…
బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బిసి జెఏసి చేపట్టిన బంద్ (Bandh) కు మద్దతుగా డిసిసి అధ్యక్షురాలు, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jagga Reddy) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలరెడ్డి మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు కల్పించాలనేది రాహుల్ గాంధీ ముఖ్యోద్దేశ్యమని తెలిపారు.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీ కులాలు అభివృద్ధిలోకి రావాలంటే బీసీ రిజర్వేషన్లు ఒక్కటే మార్గం అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎప్పుడో చెప్పారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. చిత్త శుద్ధితో అసెంబ్లీ లో బిల్లు పెట్టి బిసీ రిజర్వేషన్ల పై ఆర్డినెన్సు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూలకంటి ఆంజనేయులు, తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్, ప్రభు గౌడ్, కిరణ్ గౌడ్, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

